ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TDP WOMEN LEADERS: హోంశాఖ మంత్రి సుచరిత నిస్సహాయ శాఖా మంత్రిగా మారారు: తెదేపా - ఏపీ తాజా వార్తలు

TDP WOMEN LEADERS: వైకాపా పాలనలో ఆడబిడ్డలపై జరుగుతున్నా.. హోం మంత్రి చర్యలు తీసుకోవడంపై తెదేపా మహిళా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడ అకృత్యాలు జరిగినా.. వాటి వెనుక అధికార పార్టీ నేతలు ఉండడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.

tdp leaders
tdp leaders fired on attacks on women in ap

By

Published : Jan 29, 2022, 6:40 PM IST

TDP WOMEN LEADERS ON WOMEN SAFETY: రాష్ట్రంలో పట్టపగలు మహిళలు నడవలేని దుస్థితి వచ్చిందని తెదేపా రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షరాలు వంగలపూడి అనిత విమర్శించారు. వైకాపా ముసుగు కప్పుకున్న కొందరు నీచులు ఆడబిడ్డలపై అకృత్యాలకు పాల్పడుతున్నారన్నారంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ మూలన.. మహిళలపై అఘాయిత్యాలు జరిగినా ఖచ్చితంగా దాని వెనుక వైకాపా నేతలు ఉంటున్నారని ఆరోపించారు.

మహిళల భద్రతపై తెదేపా నేతల ఆగ్రహం

ఇదీ చదవండి: భద్రత- భవిష్యత్ కోసం మహిళలు సాగించే పోరాటానికి అండగా ఉంటా: నారా లోకేశ్

నిస్సహాయ మంత్రిగా హోం మంత్రి..

గుంటూరు జిల్లాలో మైనర్ బాలికపై అత్యాచారం కేసులో మోపిదేవి అనురుడు, వైకాపా నేత కన్నా భూశంకర్ ప్రధాన పాత్ర ఉందని ఆమె అన్నారు. నిందితుడిని అరెస్ట్ చేసినట్లు చెప్పి వైకాపా నేతలు చేతులు దులుపుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంశాఖ మంత్రి సుచరిత నిస్సహాయ శాఖా మంత్రిగా మారారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మహిళా‌ కమీషన్ చైర్ పర్సన్ ఉందో లేదో తెలియయడం లేదన్నారు. రాష్ట్రంలో‌ పరిశ్రమలు రాలేదు కానీ.. గంజాయి, డ్రగ్స్ వచ్చాయని విమర్శలు గుప్పించారు. మహిళలు సీఎంకు బుద్ధి చెప్పేరోజు త్వరలోనే వస్తుందని ఆమె వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి:ATCHANNAIDU LETTER TO CM YS JAGAN : అమూల్​తో రైతులకు లబ్ధి అబద్ధం.. పాడి రైతుల హామీలు నెరవేర్చాలి: అచ్చెన్నాయుడు

''సొంత చెల్లికి న్యాయం చేయలేని సీఎం జగన్.. రాష్ట్ర మహిళలకు ఏం న్యాయం చేస్తారు?. నేరగాళ్లు కోసం రాష్టాన్ని ఫ్రెండ్లీ గవర్నమెంట్ గా మార్చిన ఘనత సీఎంకే దక్కింది. తెదేపా హయాంలో మహిళలపై దాడి చేయాలంటే నేరస్తులు భయపడేలా చంద్రబాబు పరిపాలించారు. అధికారంలో‌ వచ్చిన తర్వాత వందలలో అత్యాచార కేసులు, దాడులు జరుగుతున్నా.. నిందితులపై ఎటువంటి చర్యలు లేవు.'' - పీతల సుజాత, మాజీ మంత్రి

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ABOUT THE AUTHOR

...view details