ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కొప్పర్రు ఘటన... మాజీ జడ్పీటీసీ కుటుంబానికి తెదేపా పరామర్శ

గుంటూరు జిల్లా కొప్పర్రులో జరిగిన దాడి ఘటనపై తెలుగుదేశం నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ మాజీ జడ్పీటీసీ ఇంటిపై వైకాపా నేతల దాడిలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపించారు. వినాయక విగ్రహానికి బహిరంగ ప్రదేశంలో అనుమతి ఇవ్వడం నుంచి గొడవ నియంత్రణలో వైఫల్యం, బాధితులపైనే కేసులు పెట్టడం వరకూ అన్నింటా అధికార పార్టీకి పోలీసులు సహకరించారని నేతలు మండిపడ్డారు.

మాజీ జడ్పీటీసీ కుటుంబానికి తెదేపా పరామర్శ
మాజీ జడ్పీటీసీ కుటుంబానికి తెదేపా పరామర్శ

By

Published : Sep 22, 2021, 3:55 AM IST

గుంటూరు జిల్లా కొప్పర్రులో వినాయక నిమజ్జనం సందర్భంగా తెలుగుదేశం శ్రేణుల ఇళ్లపై దాడి ముందస్తు వ్యూహంలో భాగంగానే జరిగిందని తెలుగుదేశం నేతలు ఆరోపించారు. కావాలనే తెలుగుదేశం మాజీ జడ్పీటీసీ శారద ఇంటికి సమీపంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద వైకాపా శ్రేణులు గణేశుడి విగ్రహం ఏర్పాటు చేశారన్నారు. నిమజ్జన ఉరేగింపు సందర్భంగా రెచ్చగొట్టేందుకే తెలుగుదేశం శ్రేణులపై వైకాపా రంగులు చల్లారని ఆరోపించారు. మరికొందరు శారద ఇంటి ప్రాంగణంలోకి ప్రవేశించి ఉద్రిక్తత పెంచారన్నారు. పరిషత్ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటిరోజే పార్టీ జెండాలతో వినాయకుడి ఊరేగింపునకు పోలీసులు అనుమతి ఎలా ఇచ్చారని తెలుగుదేశం నేతలు ప్రశ్నించారు. గొడవ ప్రారంభంలోనే అడ్డుకట్ట వేయలేకపోవడం, రెండు గంటల తర్వాత గానీ అదనపు బలగాలు అక్కడికి చేరుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. కొప్పర్రులో పర్యటించిన తెలుగుదేశం నేతల బృందం శారద కుటుంబాన్ని పరామర్శించింది.

వైకాపా రాళ్ల దాడికి భయపడి ఎస్‌.ఐ. నాగేంద్ర సైతం ప్రాణరక్షణకు తమ ఇంటిలోనే తలదాచుకున్నారని మాజీ జడ్పీటీసీ సభ్యురాలు శారద తెలిపారు. అల్లరిమూకలు వాహనాలతోపాటు ఇంట్లో వస్తువులకు నిప్పుపెట్టారని ఆమె వాపోయారు. పొగతో ఇంట్లో ఉన్నవారంతా ఉక్కిరిబిక్కిరయ్యారని వివరించారు. వైకాపా నేతలు ఎన్ని దౌర్జన్యాలకు పాల్పడినా భయపడేది లేదని తెలుగుదేశం నేతలు హెచ్చరించారు.

మాజీ జడ్పీటీసీ కుటుంబానికి తెదేపా పరామర్శ

ఇదీచదవండి.

హెబియస్ కార్పస్ పిటిషన్​పై రెండు రోజుల్లో నివేదిక సమర్పించండి: హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details