ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రతి సొసైటీలోనూ భారీ ఎత్తున మోసాలు: ధూళిపాళ్ల నరేంద్ర - సోసైటీ బ్యాంకుల్లో అక్రమాలపై చర్యలు తీసుకోవాలని తెదేపా నేతల డిమాండ్​

TDP on Fake Documents Scam in DCCB: నకిలీ పాసుపుస్తకాలతో సొసైటీ బ్యాంకుల్లో జరిగిన అక్రమాలపై ఎందుకు ఫిర్యాదు చేయలేదని బ్యాంకు​ అధికారులను తెదేపా నేతలు ప్రశ్నించారు. రాష్ట్రంలో కొత్తరకం దోపిడీ మొదలైందని.. సొసైటీలోనూ భారీ ఎత్తున మోసాలు జరుగుతున్నాయని తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్ర పేర్కొన్నారు.

tdp leaders on scam in dccb guntur district
సోసైటీ బ్యాంకుల్లో అక్రమాలపై తెదేపా నేతలు ఫైర్​

By

Published : Mar 24, 2022, 4:45 PM IST

కొత్తరకం దోపిడీ మొదలైంది: ధూళిపాళ్ల నరేంద్ర

రాష్ట్రంలో కొత్త రకం దోపిడీ మొదలైందని తెలుగుదేశం నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. నకిలీ పాస్‌బుక్​లు సృష్టించి మోసం చేస్తున్నారని.. బినామీ పేర్లు పెట్టి కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. గుంటూరు డీసీసీబీలో జరిగిన కుంభకోణంపై బ్యాంకు అధికారులు ఎందుకు ఫిర్యాదు చేయలేదని నిలదీశారు. గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.

దీన్ని బట్టి నకిలీ పాస్​పుస్తకాల వ్యవహారంలో వైకాపా నాయకులకు భాగస్వామ్యం ఉందన్న విషయం స్పష్టమవుతోందన్నారు. ప్రతి సొసైటీలోనూ భారీ ఎత్తున మోసాలు జరుగుతున్నాయని.. వీటిపై విచారణ జరపాలని ధూళిపాళ్ల నరేంద్ర డిమాండ్ చేశారు. రైతులను తప్పుదోవ పట్టించడానికి జీడీసీసీ బ్యాంక్ ఛైర్మన్​ కబుర్లు చెపుతున్నారని దుయ్యబట్టారు. అక్రమాలకు పాల్పడిన కార్యావర్గాన్ని వెంటనే తొలగించి ప్రత్యేక విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అక్రమంగా రైతుల డబ్బును దోచుకున్న వైకాపా నేతల నుంచి ఆ డబ్బు మొత్తాన్ని వసూలు చేయాలన్నారు.

ఇదీ చదవండి:ఉగాదికి సెలవు ప్రకటించకపోవడంపై ఉద్యోగుల అభ్యంతరం.. సీఎం, సీఎస్​కు లేఖ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details