రాష్ట్ర ప్రజలను జగన్ వైరస్ వణికిస్తోందని మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజేంద్రప్రసాద్ దుయ్యబట్టారు. మూడు రాజధానులకు మద్దతుగా నారావారిపల్లెలో పోలీసులను అడ్డుపెట్టుకుని సభ నిర్వహించటాన్ని వారు తీవ్రంగా ఖండించారు. 30 గృహాలున్న గ్రామంలో ప్రజలను భయటకు రానివ్వకుండా వందల మంది పోలీసులతో నిర్భందించి బెదిరించారన్నారు. ఆరుగురు మంత్రులు సభలో పాల్గొని మూడు రాజధానులకు మద్దతివ్వటం... ప్రభుత్వ సలహాదారు రాజధాని ఉద్యమం గురించి మాట్లాడటాన్ని ఖండించారు. వైకాపా ప్రభుత్వం శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తోందని మండిపడ్డారు. అమరావతి ఉద్యమానికి మద్దతు తెలిపారని విద్యార్థులను సస్పెండ్ చేయటం సరికాదని హితవు పలికారు.
రాష్ట్ర ప్రజలను జగన్ వైరస్ వణికిస్తోంది: నక్కా ఆనందబాబు - ఏపీ రాజధాని మార్పు
నారావారిపల్లెలో వైకాపా బహిరంగసభ నిర్వహించడాన్ని తెదేపా నేతలు తప్పుబట్టారు. ప్రజలను రెచ్చగొట్టేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. వందలాది మంది పోలీసులను అడ్డుపెట్టుకుని సభ నిర్వహించడమేంటని ప్రశ్నించారు.
![రాష్ట్ర ప్రజలను జగన్ వైరస్ వణికిస్తోంది: నక్కా ఆనందబాబు tdp leaders blaming ycp government for organizing public meeting in naravaripalle](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5934507-877-5934507-1580655715144.jpg)
tdp leaders blaming ycp government for organizing public meeting in naravaripalle