ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TDP: 'రాంకీ అవకతవకలకు.. నైతిక బాధ్యతగా రామకృష్ణారెడ్డి రాజీనామా చేయాలి' - RANKI FRAUD FOUND IN IT RAIDS

అమరావతి భూముల విషయంలో అక్రమాలు జరిగాయని పలుమార్లు ఆరోపణలు చేసిన మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి.. ఇప్పుడు తమ రాంకీలో బయటపడ్డ అక్రమాలపై సమాధానం చెప్పాలని తెదేపా నేతలు డిమాండ్​ చేశారు. లాభాలను.. నష్టాలుగా చూపించి అక్రమంగా విదేశాలకు తరలించిన సొమ్ముకు బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేయాలన్నారు. ప్రభుత్వం దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని తెదేపా నేతలు కోరుతున్నారు.

TDP FIRED ON  MLA RAMA KRISHNA REDDY
నైతిక బాధ్యతగా రామకృష్ణారెడ్డి రాజీనామా చేయాలి

By

Published : Jul 10, 2021, 3:52 PM IST

Updated : Jul 10, 2021, 4:46 PM IST

రాజధాని అమరావతి భూముల విషయంలో ఇన్​సైడ్ ట్రేడింగ్(INSIDER TRADING) జరిగిందని పదేపదే ఆరోపణలు చేస్తున్న మంగళగిరి శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి(MLA RAMAKRISHNA REDDY).. తన సంస్థలో జరిగిన వాటిపై ఎందుకు నోరు మెదపడం లేదని తెలుగుదేశం పార్టీ నేతలు ప్రశ్నించారు. రాంకీ సంస్థలో ఆదాయపు పన్నుశాఖ గుర్తించిన అక్రమ లావాదేవీలకు బాధ్యత వహిస్తూ రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు అయోధ్యరామిరెడ్డి తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

మదుపర్లను మోసం చేసి.. సుమారు రూ. 1200 కోట్లను నష్టాలుగా చూపుతూ సంస్థల్లోని నిధులను మలేషియాకు అక్రమంగా మళ్లించారని నేతలు పేర్కొన్నారు. బాధ్యతాయుత పదవిలో ఉంటూ.. అకౌంటింగ్​ అక్రమాలకు పాల్పడిన అయోధ్యరామిరెడ్డిపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాంకీ సంస్థకు సంబంధించిన షేర్లలో కూడా ఇన్​ సైడర్​ ట్రేడింగ్​ జరిగిందని.. రామకృష్ణారెడ్డికి ఉన్న 12000 షేర్లను కొన్నవారికి ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని తెదేపా నేతలు నిలదీశారు. నీతి నిజాయితీపరుడునని చెప్పుకుంటున్న ఎమ్మెల్యే దీనిపై నియోజకవర్గ ప్రజలకు స్పష్టత ఇవ్వాలని కోరారు. రామకృష్ణా రెడ్డి నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్​ చేస్తూ.. ఇటువంటి ఆర్థిక నేరాలకు పాల్పడిన నేతపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కేసులోని వాస్తవాలను వెలుగులోకి తెచ్చేందుకు పూర్తిస్థాయిలో విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:kollu arrest: మచిలీపట్నంలో ఆక్రమణల తొలగింపు ఉద్రిక్తం.. కొల్లు రవీంద్ర అరెస్ట్!

రాంకీ సంస్థలో గుర్తించిన అవకతవకలు..

రాంకీ సంస్థ తెలంగాణలోని హైదరాబాద్ కేంద్రంగా వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తోంది. స్థిరాస్తి వ్యాపారం, నిర్మాణ రంగం, వ్యర్థాల నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పన విభాగాలను ఈ సంస్థ నిర్వహిస్తోంది. ఇందులో స్థిరాస్తి వ్యాపారం హైదరాబాద్​లోనే నిర్వహిస్తుండగా మిగిలినవి దేశవ్యాప్తంగా విస్తరించింది. ఈ సంస్థ చేస్తున్న వివిధ వ్యాపార లావాదేవీలకు చెందిన పన్ను చెల్లింపులు సక్రమంగా లేనట్లుగా గుర్తించిన ఆదాయపు పన్ను శాఖ, ఈ నెల 6న హైదరాబాద్​లో దాడులు నిర్వహించింది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని రాంకీ సంస్థ ప్రధాన కార్యాలయంతో పాటు ఇల్లు, అనుబంధ సంస్థల కార్యాలయాల్లో సోదాలు చేసింది. మొత్తం 15 ఐటీ బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నాయి.

తనిఖీల సందర్భంగా భారీగా అక్రమ లావాదేవీలను గుర్తించినట్లు ఆదాయపన్నుశాఖ ప్రకటన విడుదల చేసింది. ఇందుకు సంబంధించి పెద్ద మొత్తంలో పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రాంకీ సంస్థ సింగపూర్‌లోని ఓ ప్రవాస సంస్థకు మెజార్టీ వాటాను విక్రయించి భారీ మొత్తం మూలధన లాభాలను ఆర్జించినట్టు ఐటీ శాఖ గుర్తించింది. అయితే మూలధన లాభాలకు బదులుగా నష్టాన్ని సృష్టించినట్లు పేర్కొంది. నష్టాలు చూపించిన మొత్తం దాదాపు రూ.1,200 కోట్లు ఉన్నట్లు వెల్లడించింది. ఇందుకు సంబందించి పన్ను విధించాల్సి ఉందని స్పష్టం చేసింది.

మరో రూ.288 కోట్ల అనధికారిక లావాదేవీలు జరిగినట్లు, ఇది లాభాలకు పూర్తి విరుద్ధంగా చూపిన మొత్తంగా తెలిపింది. ఇందుకు చెందిన దోషపూరిత పత్రాలను గుర్తించింది. ఇవి కాకుండా లెక్కల్లో చూపని నగదు లావాదేవీలు జరిగినట్లు కూడా గుర్తించింది. లెక్కించని ఆదాయం రూ.300 కోట్లుగా పేర్కొంది. ఈ అనధికారిక రూ.300 కోట్లతో పాటు, ఎగవేతకు పాల్పడిన పన్నును చెల్లించేందుకు రాంకీ సంస్థ అంగీకరించినట్లు ఐటీశాఖ వెల్లడించింది. తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని ఐటీ శాఖ స్పష్టం చేసింది.

ఇదీ చదవండి:

ఈ 'సోలార్​ సైకిల్​'తో.. ఇంధన ఖర్చు ఆదా!

Last Updated : Jul 10, 2021, 4:46 PM IST

ABOUT THE AUTHOR

...view details