తెదేపా రెబల్ ఎమ్మెల్యేల వైఖరిపై తెలుగు తమ్ముళ్ల నిరసన - rajya sabha elections latest news in telugu
రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటేసిన ఎమ్మెల్యేలు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని తెదేపా రాష్ట్ర కార్యదర్శి పిల్లి మాణిక్యరావు డిమాండ్ చేశారు. తెదేపా రెబల్ ఎమ్మెల్యేల వైఖరి నిరసిస్తూ తెలుగు తమ్ముళ్లతో కలిసి ఆయన గుంటూరులో ఆందోళన చేపట్టారు.
తెదేపా రెబల్ ఎమ్మెల్యేల వైఖరిని నిరసిస్తూ గుంటూరులో తెలుగు తమ్ముళ్లు ఆందోళనకు దిగారు. స్థానిక లాడ్జీ సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర కార్యదర్శి పిల్లి మాణిక్యరావు పాల్గొన్నారు. ప్రతిపక్షంలో ఉండి ప్రజల తరపున పోరాడటం చేతకాక... ప్రలోభాలకు లొంగిపోయారంటూ మాణిక్యరావు ఆరోపించారు. రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటేసిన మద్దాలి గిరిధర్, వల్లభనేని వంశీ, కరణం బలరాం వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజీనామా చేయకుండా చంద్రబాబుని విమర్శించటాన్ని ఆయన తప్పుబట్టారు.