ముఖ్యమంత్రి జగన్ పాలనలో వ్యవసాయం సంక్షోభంలో ఉందని, అనుబంధ రంగాలు తిరోగమనంలో పయనిస్తున్నాయని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. వ్యవసాయ ఆధారిత కుటుంబాలు 70 నుంచి 50 శాతానికి పడిపోవడం జగన్ రైతు వ్యతిరేక విధానాలకు నిదర్శనమన్నారు. చంద్రబాబు పాలనలో సాగు రంగం రెండంకెల వృద్ధిరేటు సాధించిందని గుర్తు చేశారు. పరిశ్రమలు, సేవా రంగాల అభివృద్ధి కూడా తిరోగమనంలో ఉందని ఆక్షేపించారు.
YANAMALA : 'సీఎం జగన్ పాలనలో వ్యవసాయరంగం సంక్షోభం ఉంది' - TDP leader yanamala ramakrishnudu
సీఎం జగన్ పాలనలో వ్యవసాయం సంక్షోభంలో పడిందని తెదేపా నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. వ్యవసాయ అనుబంధ రంగాలు తిరోగమనంలో పయనిస్తున్నాయని విమర్శించారు. ఆహార పంటల దిగుబడులు కూడా తగ్గిపోయాయని ఆక్షేపించారు.
![YANAMALA : 'సీఎం జగన్ పాలనలో వ్యవసాయరంగం సంక్షోభం ఉంది' తెదేపా నేత యనమల రామకృష్ణుడు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13176132-53-13176132-1632634652725.jpg)
తెదేపా నేత యనమల రామకృష్ణుడు
ఆహార పంటల దిగుబడులు కూడా తగ్గిపోయాయని, 2019-20తో పోల్చుకుంటే 2020-21లో 3 శాతం మేర దిగుబడులు తగ్గాయని యనమల రామకృష్ణుడు అన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడుతూ రైతుల మెడకు ఉరితాడు బిగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు విక్రయించిన పంటలకు సరైన సమయంలో నగదు చెల్లించడంలో విఫలమయ్యారని విమర్శించారు. ఆహార ద్రవ్యోల్బణం కూడా అత్యధికంగా 12.5 శాతం నమోదైందని, పెట్టుబడి వ్యయం పెరగడంతో క్రాప్ హాలిడేలు ప్రకటించే పరిస్థితి నెలకొందన్నారు.
ఇదీచదవండి.