ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసే కుట్ర'

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తక్షణమే విరమించుకోవాలని మాజీ మంత్రి, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్​బాబు డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమ బాటపడతామని హెచ్చరించారు.

nakka anand babu protest against vizag steel plant privatizations
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు కుట్ర

By

Published : Feb 13, 2021, 4:13 PM IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్రలో భాగంగానే విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలని ప్రయత్నిస్తున్నాయని మాజీ మంత్రి, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్​బాబు పేర్కొన్నారు. స్టీల్​ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ.. గుంటూరులో అమృతరావు విగ్రహాం వద్ద నిరసన చేపట్టారు. ఎంతోమంది త్యాగాల ఫలితంగా ఏర్పడిన విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేయడం అంటే ఆంధ్రుల హక్కును కాలరాయడమే అని అన్నారు.

ప్రభుత్వ నిర్ణయంతో వేల మంది కార్మికులు రోడ్డున పడే అవకాశం ఉందన్నారు. విశాఖలో ఐక్య కార్యాచరణ వేదిక అధ్వర్యంలో చేపట్టిన ఉద్యమానికి సంఘీభావంగా నేడు గుంటూరులో నిరసన చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఇదీ చదవండి:సమస్య చెప్పడానికి వెళ్లిన ఎమ్మెల్యే.. మీరెవరో తెలియదన్న పోలీసులు!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details