ETV Bharat Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మాజీ మైనారిటీ కార్పొరేషన్​ ఛైర్మన్​ 12 గంటల దీక్ష - గుంటూరు తాజా కొవిడ్​ వార్తలు

గుంటూరులో ఓ ప్రముఖ హోటల్​ యాజమాని అంత్యక్రియలు ఇస్లాం మతానికి విరుద్ధంగా అంతిమ సంస్కారాలు చేశారని తెదేపా నేత దీక్ష చేపట్టారు. దీనిపై విచారణ జరపాలని మాజీ మైనారిటీ ఛైర్మన్​ ఎండీ హిదాయత్​ 12 గంటలపాటు నిరసన దీక్ష చేశారు.

tdp leader hidayat went in hunger strike for 12 hours
దీక్ష చేపట్టిన తెదేపా నేత హిదాయత్
author img

By

Published : May 2, 2020, 9:43 AM IST

గుంటూరులోని ఓ ప్రముఖ హోటల్ యజమాని కరోనా వైరస్ కారణంగా మృతి చెందాడు. అయితే అతని అంత్యక్రియల విషయంలో జిల్లా యంత్రాంగం తీవ్ర తప్పిదం చేసిందని మాజీ మైనారిటీ కార్పొరేషన్ ఛైర్మన్ ఎండీ హిదాయత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ 12 గంటల పాటు నిరసన దీక్ష చేపట్టాడు. ఇస్లాం మతం ప్రకారం చేయాల్సిన అంతిమ సంస్కరణలకు విరుద్ధంగా అతనిని ఖననం చేయడం జరిగిందన్నారు. దీనిపై విచారణ జరిపి జిల్లా యంత్రాంగంపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్... హోటల్ యజమాని మృతి గురించి వారి కుటుంబ సభ్యులకు తెలియజేశామన్నారు. వారి అనుమతితోనే ఖననం చేశామని వివరించారు. మరోసారి ఇలాంటివి జరగకుండా వారి వారి మత పద్ధతిలో అంతిమ సంస్కరణలు చేయడానికి సన్నాహాలు చేస్తామన్నారు. వారికి ప్రత్యేక శ్మశానవాటికలు ఏర్పాటు చేస్తామని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ చెప్పారు.

in article image
దీక్ష చేపట్టిన తెదేపా నేత హిదాయత్
ఖననంపై వివరణ ఇస్తున్న కలెక్టర్​

ABOUT THE AUTHOR

...view details