ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

DULIPALLA NARENDRA: 'మద్యం ఆదాయాన్ని ప్రభుత్వం బంగారు బాతుగా చూస్తోంది' - andhrapradesh latest news

అధికారంలోకి రాకముందు వైకాపా ఇచ్చిన మద్యనిషేధ హామీ ఇప్పుడు ఏమైందని తెలుగుదేశం సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర(TDPleader dulipalla narendra) ప్రశ్నించారు. మంగళగిరి(mangalagiri)లో మీడియాతో మాట్లాడిన ఆయన కొత్త కొత్త బ్రాండ్లతో ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారని విమర్శించారు.

తెలుగుదేశం సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర
తెలుగుదేశం సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర

By

Published : Nov 11, 2021, 9:37 PM IST

తెలుగుదేశం సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర

అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం విధిస్తామని చెప్పిన సీఎం జగన్(CM jagan)...ప్రస్తుతం ఆ హామీని విస్మరించారని తెదేపా సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర(TDP leader dulipalla narendra) ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యనిషేధాన్ని అమలు చేయకుండా... మద్యాన్ని ప్రోత్సహిస్తోందని ఆక్షేపించారు. మద్యం ద్వారా రూ.20 వేల కోట్లకు పైగా ఆదాయం(income) వస్తోందన్న ధూళిపాళ్ల...మద్యం ఆదాయాన్ని ప్రభుత్వం బంగారు బాతుగా చూస్తోందని వ్యాఖ్యానించారు. అక్రమ మద్యం వ్యాపారం(illegal wine marketing)తో వైకాపా నేతలు విచ్చలవిడిగా సంపాదిస్తున్నారని ధూళిపాళ్ల నరేంద్ర మండిపడ్డారు. మద్యం డిస్టిలరీలు వైకాపా నేతల చేతుల్లోనే ఉండటంతో కొత్త కొత్త బ్రాండ్లు తీసుకొచ్చారని అన్నారు. ఫలితంగా చాలామంది అనారోగ్యాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

భవిష్యత్​లో వచ్చే ఆదాయాన్నీ తాకట్టుపెట్టారు...

మద్యం ద్వారా ప్రభుత్వం పేదల రక్తం తాగుతోందని ధూళిపాళ్ల నరేంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో నంబరు 90 ద్వారా 10 డిస్టిలరీల అదనపు ఆదాయాన్ని తాకట్టు పెట్టారని ఆరోపించారు. అప్పులు కోసం మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. భవిష్యత్‌లో వచ్చే ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టారన్న నరేంద్ర...మద్య నిషేధంలో ప్రభుత్వం, వైకాపా నేతలు(YCP leaders) విశ్వసనీయతను కోల్పోయారని వెల్లడించారు.

వ్యాట్ ఎందుకు తగ్గించట్లేదు...

మద్యంపై వ్యాట్‌(vat on wine)ను ఎందుకు తగ్గించట్లేదని ధూళిపాళ్ల నరేంద్ర ప్రశ్నించారు. సెస్ ద్వారా కేంద్రం రూ.లక్షల కోట్లు దోపిడీ చేస్తోందని వైకాపా ఆరోపించిందని...మద్యంపై వ్యాట్ వసూలు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దోపిడీ చేయట్లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. రుణాలు తేవడంపై ప్రభుత్వంపై హైకోర్టు(high court fire on government) కూడా ఆగ్రహం వ్యక్తం చేసిందని గుర్తు చేశారు. గవర్నర్ పేరు పెట్టి రుణాలు ఎలా తెస్తారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినా... వైకాపా నేతల్లో మార్పు రాలేదని ఎద్దేవా చేశారు.

అధికారంలోకి వస్తే మద్య నిషేధం విధిస్తామని చెప్పారు. మద్యం ఆదాయాన్ని ప్రభుత్వం బంగారు బాతుగా చూస్తోంది. అక్రమ మద్యం వ్యాపారంతో వైకాపా నేతలు విచ్చలవిడిగా సంపాదిస్తున్నారు. కొత్త కొత్త బ్రాండ్లతో చాలామంది అనారోగ్యాలకు గురవుతున్నారు. అప్పులు కోసం మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టారు. భవిష్యత్‌లో వచ్చే ఆదాయాన్నీతాకట్టు పెట్టారు. మద్యంపై వ్యాట్ వసూలు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దోపిడీ చేయట్లేదా?. రుణాల తేవడంపై ప్రభుత్వంపై హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. గవర్నర్ పేరు పెట్టి రుణాలు ఎలా తెస్తారని హైకోర్టు ప్రశ్నించలేదా..? - ధూళిపాళ్ల నరేంద్ర, తెదేపా సీనియర్ నేత

ఇవీచదవండి.

ABOUT THE AUTHOR

...view details