Dhulipalla Narendra:పెదకాకాని దేవస్థానం క్యాంటీన్‌లో మాంసాహారం తయారు చేసిన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోలేదంటూ తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆందోళన చేశారు. "చలో పెదకాకాని" పేరిట ఆలయానికి వెళ్తున్న ధూళిపాళ్లను పోలీసులు అడ్డుకున్నారు. వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చిన ధూళిపాళ్ల.. ఈవో అందుబాటులో లేకపోవడంతో కొద్దిసేపు అక్కడే బైఠాయించారు. బాధ్యులపై చర్యలు తీసుకునేంత వరకూ ఆందోళన విరమించేది లేదన్నారు.
"క్యాంటీన్‌లో మాంసాహారం వండిన వారిపై చర్యలు తీసుకోవాలి" - గుంటూరు జిల్లా తాజా వార్తలు
Dhulipalla Narendra: పెదకాకాని ఆలయం వద్ద తెదేపా నేత ధూళిపాళ్ల ఆందోళనకు దిగారు. "చలో పెదకాకాని" పేరిట ఆందోళన చేపట్టిన తెదేపా నేత ధూళిపాళ్ల.. క్యాంటీన్‌లో మాంసాహారం వండిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

పెదకాకాని ఆలయం వద్ద తెదేపా నేత ధూళిపాళ్ల ఆందోళన
పెదకాకాని ఆలయం వద్ద తెదేపా నేత ధూళిపాళ్ల ఆందోళన