తెదేపా హయాంలో "నీరు-చెట్టు" (neeru-chettu) పథకం(scheme)లో పనులు చేసిన కాంట్రాక్టర్లకు చివరి రూపాయి చెల్లించే వరకూ కృషి చేస్తామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు(TDP president chandrababunaidu) హామీ ఇచ్చారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్(NTR bhavan)లో నీరు-చెట్టు పెండింగ్ బిల్లుల ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక విభాగాన్ని ఆయన ప్రారంభించారు. రూ.1,277కోట్లు పనులకు సంబంధించిన బిల్లులు సీఎఫ్ఎంఎస్(CFMS)లో పెండింగ్లో, నూతనంగా మంజూరు కావాల్సిన మరో రూ.500కోట్లు విడుదల చేసే వరకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని చంద్రబాబు పేర్కొన్నారు.
Pending Bills of Neeru-Chettu: నీరు-చెట్టు పథకం బిల్లులు చెల్లించే వరకు కృషి చేస్తాం: చంద్రబాబు
17:48 October 08
వైకాపా వచ్చాక కక్షతో పనులు నిలిపేశారు: చంద్రబాబు
చిన్న నీటిపారుదల, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖల్ని సమన్వయం చేసుకుంటూ దేశంలోనే తొలిసారిగా నీరు-ప్రగతి కింద రూ.18,265కోట్లు వెచ్చించి నీటి సంరక్షణ చర్యలు చేపట్టామని తెదేపా అధినేత చంద్రబాబు వివరించారు. 98 కోట్ల ఘనపు మీటర్ల పూడిక మట్టిని తొలగించి, 90టీఎంసీల భూగర్భ జలాలు(ground water) పెంచి, 6.79లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు స్థిరీకరించామన్నారు. ఈ పథకానికి గానూ 9మెరిట్ స్కాచ్ అవార్డులు(merit awards) రాష్ట్ర ప్రభుత్వానికి దక్కాయని తెలిపారు. వైకాపా అధికారంలోకి నీరు-చెట్టు పనులు నిలిపివేయడంతో నీటి సంఘాల ప్రతినిధులు, రైతులు రోడ్డున పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నీరు-చెట్టు పెండింగ్ బిల్లుల ఫిర్యాదుల కోసం ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించాం. నీరు-చెట్టు పథకం బిల్లులు చెల్లించే వరకు కృషి చేస్తాం. మంజూరు కావాల్సినవి మరో రూ.500కోట్లు ఉన్నాయి. తెదేపా హయాంలో 9మెరిట్ స్కాచ్ అవార్డులు వచ్చాయి. వైకాపా వచ్చాక కక్షతో పనులు నిలిపేశారు. నీటి సంఘాల ప్రతినిధులు, రైతులకు అన్యాయం చేశారు. - చంద్రబాబునాయుడు, తెదేపా అధినేత
ఇదీ చదవండి
నాలుగు వారాల్లోగా రాజధాని రైతులకు కౌలు చెల్లించండి: హైకోర్టు