ఎన్నికల నేపథ్యంలో గుంటూరు నగరంలో నిర్వహించిన ఓ సమావేశంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అధికార పార్టీకి చెందిన అభ్యర్థులకు మద్దతుగా నగరంలో ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అదే సామాజిక వర్గానికి చెందిన 35వ వార్డులో తెదేపా తరపున పోటీ చేస్తున్న బాబు సమావేశానికి హాజరయ్యారు. పార్టీ కండువా వేసుకుని సమావేశాన్ని చివరి వరకూ తిలకించారు. సమ్మేళనం ముగింపు సమయంలో తనకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. అందుకు వేదికపై ఉన్న అతిథులతో పాటు నిర్వాహకులు వ్యతిరేకించారు. సమావేశానికి ఎందుకు వచ్చావంటూ ప్రశ్నించారు. ఈ క్రమంలో కొద్దిపాటి వాగ్వాదం తరువాత వివాదం సద్దుమణిగింది.
వైకాపాకు మద్దతుగా ఆత్మీయ సమ్మేళనం..హాజరైన తెదేపా అభ్యర్థి!
మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఓ సామాజిక వర్గం వారు సమ్మేళనం నిర్వహించారు. ఆ సమావేశానికి ప్రతిపక్ష పార్టీకి చెందిన పోటీ చేస్తున్న అభ్యర్థి కండువాతో ప్రత్యక్షమయ్యాడు. ఒక్క క్షణం అక్కడున్నవారంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. చివరి వరకూ సమావేశంలో ఉన్న ఆయన.. మాట్లాడేందుకు ప్రయత్నించగా నిర్వాహకులు నిరాకరించారు.
ap muncipal elections 2021