ప్రజలలో జాతీయ భావం పెరగాలంటే.. కులం, మతం, లింగ బేధాలు ఉండకూడదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు అన్నారు. ఇటీవల హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన ఆర్మీ అధికారుల సంస్మరణ సభ.. గుంటూరు జిల్లా పెదనందిపాడులో ఏర్పాటు చేశారు. అమరులైన జవాన్లకు నివాళులర్పించారు.
Justice lavu nageswara rao : "సైన్యంలో చేరేందుకు యువత సిద్ధంగా ఉండాలి"
తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన జవాన్లకు సూప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు నివాళులర్పించారు. గుంటూరు జిల్లా పెదనందిపాడులో ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో ఆయన పాల్గొన్నారు.
జస్టిస్ లావు నాగేశ్వరరావు
ఈ సందర్భంగా జస్టిస్ లావు నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారంటే సరిహద్దుల్లో సైనికుల వల్లనే అని అన్నారు. లింగ సమానత్వం విషయంలో.. సుప్రీంకోర్టు తీర్పుతో ఆడపిల్లలకు ఆర్మీలో శాశ్వత కమిషన్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. సైనికులుగా విధులు నిర్వహించేందుకు యువకులు ఆలోచించాలని కోరారు.
ఇదీచదవండి :