Governor: ఆరోగ్యశ్రీ వైద్యసేవలతో పేదోడి వైద్యానికి మంచి భరోసా ఏర్పడిందని, ఇదో గొప్ప పథకమని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ఈ పథకం ద్వారా పేదలకు నగదు రహిత వైద్యసేవలు అందుతున్నాయని ప్రశంసించారు. దేశానికే ఆదర్శవంతమైన ఈ పథకాన్ని ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో గత కొన్నేళ్లుగా కొనసాగిస్తూ వస్తోందని, దీని వల్ల పేదలకు ఖరీదైన వైద్యసేవలు ఉచితంగా లభ్యం కావడం అభినందనీయమన్నారు.
Governor: "అది గొప్ప పథకం... పేదోడి మెరుగైన వైద్యానికి భరోసా..!" - ఏపీ లేటెస్ట్ అప్డేట్స్
Governor: ఆరోగ్యశ్రీ గొప్ప పథకమని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ఈ పథకం ద్వారా పేదలకు మెరుగైన వైద్యం ఉచితంగా లభిస్తోందని అభినందనీయం అని తెలిపారు. అలాంటి ఈ పథకాన్ని ఏపీ ప్రభుత్వం సమర్ధంగా అన్ని ఆస్పత్రుల్లో అమలు చేస్తోందని ప్రశంసించారు.
గుంటూరులోని సాయిభాస్కర్ ఆసుపత్రిలో ఓ బ్లాక్‌ను మోకీలు శస్త్రచికిత్సల మార్పిడిలో ఆధునిక వైద్యసేవలు అందించటానికి వీలుగా విస్తరించారు. ఈ బ్లాక్‌ను ఆదివారం గవర్నర్ ప్రారంభించారు. ఆరోగ్యశ్రీ కింద అందుతున్న వైద్య సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలే వైద్యులకు లక్ష్యం కావాలని గవర్నర్ ఈ సందర్భంగా సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు మేరుగ నాగార్జున, అంబటి రాంబాబు, ఆసుపత్రి అధినేత డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి పాల్గొన్నారు.
ఇదీ చదవండి: అప్రకటిత విద్యుత్ కోతలు... ఇన్వర్టర్లకు పెరిగిన గిరాకీ