అంతర్జాతీయ అంతరీక్ష కేంద్రం నిర్మించి 20 ఏళ్లు పూర్తైన సందర్భంగా గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలోని విజ్ఞాన్ యూనివర్సిటీ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించింది. మూడు రోజులపాటు ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ప్రపంచంలో అపురూప కట్టడమని షార్ మాజీ డైరెక్టర్, విజ్ఞాన్ విశ్వవిద్యాలయం ఉపకులపతి, పద్మశ్రీ ఎంవైఎస్ ప్రసాద్ అన్నారు. ఈ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని అమెరికా (నాసా), రష్యా (రోస్‌కాస్మోస్), జపాన్ (జాక్సా), ఐరోపా దేశాలు (ఇఎస్‌ఏ), కెనడా (సీఎస్‌ఏ) లకు చెందిన అంతరిక్ష సంస్థలు కలిసి నిర్మించాయని తెలిపారు. కార్యక్రమంలో విజ్ఞాన్ విద్యాసంస్థల ఛైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య, ఇంఛార్జి రిజిస్ట్రార్ డాక్టర్ పీఎంవీ రావు, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
'అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం.. అపురూప కట్టడం' - విజ్ఞాన్ యూనివర్సిటీ తాజా వార్తలు
అంతర్జాతీయ అంతరీక్ష కేంద్రం నిర్మించి 20 ఏళ్లు పూర్తైన సందర్భంగా గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలోని విజ్ఞాన్ యూనివర్సిటీ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. అంతరీక్ష కేంద్రం నిర్మాణంపై విజ్ఞాన్ విశ్వవిద్యాలయం ఉపకులపతి, పద్మశ్రీ ఎంవైఎస్ ప్రసాద్ విద్యార్థులకు అవగాహన కల్పించారు.
special programs at vignan university on 20 years on space centre
Last Updated : Dec 22, 2020, 10:36 PM IST