గుంటూరులో కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. కర్ఫ్యూను కఠినం చేయాలని అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి సిబ్బందికి సూచించారు. గుంటూరు నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన కర్ఫ్యూ అమలుపై ఆరా తీశారు. ప్రభుత్వం అదేశాల మేరకు కర్ఫ్యూ ను కఠినతరం చేశామన్నారు. కర్ఫ్యూ సమయంలో బయటకు వచ్చే వారి వివరాలను అడిగి తెలుసుకుని పంపిస్తున్నట్లు చెప్పారు.
బయట ప్రాంతాల నుంచి వచ్చే వారి వివరాలు పరిశీలించి సరైన కారణం ఉంటేనే అనుమతి ఇస్తున్నామన్నారు. పూర్తి స్థాయిలో కరోనా కట్టడికి ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. కర్ఫ్యూ నిబంధనలు ఉల్లఘించి రోడ్డుపైకి వచ్చిన వారిపై కేసులు పెడుతూ... వాహనాలను జప్తు చేస్తున్నామని వెల్లడించారు. అత్యవసర పరిస్థితుల్లో మినహా ప్రజలు ఎవరు బయటకు రావద్దని... నిబంధనలు ఉల్లంఘించినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.