Idol controversy in Guntur: గుంటూరులో విగ్రహాల వివాదం రాజుకుంది. అనుమతి లేదంటూ విగ్రహాల దిమ్మెలను నగరపాలక సంస్థ కూల్చివేయడం తీవ్ర వివాదస్పదమైంది. మొన్న బీపీ మండల్ విగ్రహం దిమ్మె.. నిన్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని కూడా తొలగించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గుంటూరులో విగ్రహాల వివాదం రాజుకుంది. అనుమతి లేదంటూ విగ్రహాల దిమ్మెలను నగరపాలక సంస్థ కూల్చివేయడం తీవ్ర వివాదస్పదమైంది. మొన్న బీపీ మండల్ విగ్రహం దిమ్మె.. నిన్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని కూడా తొలగించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
విగ్రహాల ఏర్పాటుని అడ్డుకోవడం వివాదానికి దారి తీసింది:వారం రోజుల క్రితం బీపీ మండల్ విగ్రహం దిమ్మెను తొలగించిన నగరపాలక సంస్థ.. తాజాగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం తొలగించడంపై విమర్శలు వచ్చాయి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటుకు కళాదర్బార్ సంస్థ అనుమతి కోరగా నాజ్ సెంటర్‌లో ఏర్పాటుకు నగరపాలక సంస్థ అనుమతించింది. జూన్ 11న ఎస్పీ శైలజ చేతుల మీదుగా బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఆవిష్కరించారు. అయితే నాజ్ సెంటర్ కూడలిని కుదిస్తున్నట్లు వార్తలు రావటంతో అక్కడ విగ్రహ ఏర్పాటుని కమిటీ విరమించుకుంది. అదే విగ్రహాన్ని ఈనెల 2వ తేదిన మదర్ థెరిస్సా కూడలి వద్ద ఏర్పాటు చేయగా.. నగరపాలక సంస్థ తొలగించింది. కనీస సమాచారం ఇవ్వకుండా తొలగించడంపై నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.