భాజపా రాష్ట్ర నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు.. ఆ పార్టీ నేత కన్నా లక్ష్మీనారాయణతో భేటీ అయ్యారు. విజయవాడలో మాజీమంత్రి మాణిక్యాలరావు సంతాప సభ అనంతరం సోము వీర్రాజు గుంటూరులోని కన్నా నివాసానికి వెళ్లారు. కన్నా నివాసంలో ఆయనతో కలిసి సోము వీర్రాజు భోజనం చేశారు. కన్నాతో మర్యాదపూర్వకంగా భేటీ అయినట్లు సోము ట్విట్టర్లో వెల్లడించారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, భాజపా బలోపేతం గురించి ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
కన్నా లక్ష్మీనారాయణతో సోము వీర్రాజు భేటీ - సోము వీర్రాజు తాజా వార్తలు
గుంటూరులోని కన్నా లక్ష్మీనారాయణ నివాసానికి సోము వీర్రాజు వెళ్లారు. కన్నాను మర్యాదపూర్వకంగా కలిశారు. కన్నా నివాసంలో భోజనం చేశారు సోము వీర్రాజు.
కన్నా లక్ష్మీనారాయణతో సోము వీర్రాజు భేటీ