Somu veerraju comments: 2024 ఎన్నికల్లో భాజపా అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ధీమా వ్యక్తం చేశారు. కార్తీక సోమవారం సందర్భంగా గుంటూరు చుట్టుగుంటలోని పోలేరమ్మ ఆలయంలో జరిగిన హోమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సోము వీర్రాజు... రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి ప్రజావ్యతిరేక చర్యలు మానుకోవాలని హితవు పలికారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రమాద ఘంటికలు మోగిస్తోందని.. త్వరలో ఉద్యోగులకూ జీతాలు ఇవ్వలేని పరిస్థితి తలెత్తనుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి అన్ని రకాల సాయం అందుతోందని వెల్లడించారు. ఆదాయం వచ్చే మార్గాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదని విమర్శించారు. అమరావతి గురించి మాట్లాడే హక్కు భాజపాకు మాత్రమే ఉందని పేర్కొన్నారు. రాజధాని ప్రాంత అభివృద్ధికి కేంద్రం ఎంతగానో సహకరించిందని వివరించారు.
Somu veerraju comments at Guntur: 'సీఎం ప్రజా వ్యతిరేక చర్యలు మానుకోవాలి' - ఏపీ తాజా వార్తలు
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వస్తుందని సోము వీర్రాజు(Somu veerraju comments at Guntur) అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. కార్తీక మాస ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొన్నారు.
Somu veeraju