గుంటూరు ప్రగతినగర్ వద్ద ప్రదీప్‌కుమార్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీరు హత్యకేసును పోలీసులు ఛేదించారు. చేసిన అప్పు తీర్చమన్నందుకే హత్య చేశారని తేల్చిన పోలీసులు... పాత గుంటూరుకు చెందిన సోను, ఐపీడీ కాలనీకి చెందిన శ్రీనివాస్ అనే ఇద్దరు వ్యక్తుల్ని అరెస్టు చేశారు. నిందితుల నుంచి బంగారు ఉంగరాలు, ఇనుప రాడ్లు, బండరాయిని స్వాధీనం చేసుకున్నారు. సాప్ట్వేర్ ఇంజినీర్ ప్రదీప్‌కుమార్ మృతదేహాన్ని జులై 31న గుర్తించిన పోలీసులు.... శరీరంపై గాయాల ఆధారంగా హత్యేనని తేల్చారు.
సాఫ్ట్వేర్ ఇంజినీరు హత్యకేసును ఛేదించిన పోలీసులు - Guntur Crime news
గుంటూరు ప్రగతినగర్ వద్ద జరిగిన సాఫ్ట్వేర్ ఇంజినీరు హత్యకేసును పోలీసులు ఛేదించారు. పాత గుంటూరుకు చెందిన సోను, ఐపీడీ కాలనీకి చెందిన శ్రీనివాస్ అనే ఇద్దరు వ్యక్తుల్ని అరెస్టు చేశారు. గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి హత్యకేసు వివరాలను వెల్లడించారు.

గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి హత్యకేసు వివరాలను వెల్లడించారు. ఇంటికి సీలింగ్ పనులు నిర్వహించే సోనుకు.. ఇంటి యజమాని ప్రదీప్‌కుమార్‌తో పరిచయం ఏర్పడగా... ఇదే అదనుగా వ్యాపారం చేస్తున్నట్లు చెప్పి అతని కుటుంబసభ్యుల నుంచి పలు ధపాలుగా 40 లక్షల రూపాయల వరకు సోను అప్పుగా తీసుకున్నాడు. చేసిన అప్పు తీర్చకపోవడంతో ప్రదీప్‌కుమార్ ఒత్తిడి చేశాడు. దీంతో స్నేహితుడు శ్రీనివాస్ సాయంతో ప్రదీప్‌కుమార్‌ను ఇనుపరాడ్లు, బండరాయితో మోది హత్య చేసినట్లు ఎస్పీ అమ్మిరెడ్డి చెప్పారు.
ఇదీ చదవండీ... శ్రీకాళహస్తిలో అనధికార విగ్రహాలు: నిందితుల అరెస్టు