ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

భర్త వేధింపులు తాళలేక సాఫ్ట్​వేర్​ ఉద్యోగిని ఆత్మహత్య

భర్త వేధింపులు తాళలేక ఓ సాఫ్ట్​వేర్​ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద సంఘటన హైదరాబాద్​లోని రాయదుర్గం పీఎస్​ పరిధిలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

software-employee-suicide-in-hyderabad
భర్త వేధింపులు తాళలేక సాఫ్ట్​వేర్​ ఉద్యోగిని ఆత్మహత్య

By

Published : Nov 28, 2019, 11:47 PM IST

భర్త వేధింపులు తాళలేక సాఫ్ట్​వేర్​ ఉద్యోగిని ఆత్మహత్య

భర్త వేధింపులు తాళలేక సాఫ్ట్​వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకున్న ఘటన... తెలంగాణలోని హైదరాబాద్​ రాయదుర్గం పీఎస్​ పరిధిలో జరిగింది. గచ్చిబౌలి ఖాజాగూడలోని స్వరూప రెసిడెన్సీలో కృష్ణకిశోర్, హిరణ్మయి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరు సాప్ట్‌వేర్ ఉద్యోగులు. గుంటూరు తెనాలి ప్రాంతానికి చెందిన హిరణ్మయి... గుంటూరుకు చెందిన కృష్ట కిశోర్​ను వివాహం చేసుకుంది. కిశోర్ 'ఎల్​ అండ్​ టీ'లో ఉద్యోగం చేస్తుండగా...హిరణ్మయి విప్రోలో పని చేస్తుంది. భర్త వేధింపులు, కుటుంబ తగాదాల కారణంగానే హిరణ్మయి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాయదుర్గం సీఐ రవీందర్​ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details