Suicide attempt: గుంటూరు జిల్లా దుగ్గిరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద సామాజిక కార్యకర్త నన్నెపాగ వెంకట్రావు ఆత్మహత్యకు యత్నించారు. దుగ్గిరాలలో ట్రాఫిక్, పందుల సమస్యలపై ఆయన అధికారులకు ఫిర్యాదు చేశారు. వాటిపై అధికారులు పట్టించుకోలేదని ఇవాళ ఎంపీడీవో కార్యాలయం వద్ద టెంట్ వేసుకుని ఆందోళనకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే వెంకట్రావు వేసిన టెంట్‌ను అధికారులు తొలగించారు. దీంతో ఆవేదనకు గురైన వెంకట్రావు తనకు ఆందోళన నిర్వహించే హక్కు కూడా లేదా అంటూ నిలదీశారు.
సామాజిక కార్యకర్త వెంకట్రావు ఆత్మహత్యాయత్నం.. ఎందుకంటే..? - గుంటూరు జిల్లా తాజా వార్తలు
Suicide attempt: గుంటూరు ఎంపీడీవో కార్యాలయం వద్ద టెంటు వేసుకుని నిరసన తెలుపుతున్న సామాజిక కార్యకర్త వెంకట్రావు ఆత్మహత్యకు యత్నించాడు. వినతిపత్రం ఇచ్చినా అధికారులు స్పందించట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు సమస్యల పరిష్కారమంటూ వెంకట్రావు వేధిస్తున్నారన్నారని ఉద్యోగులు చెబుతున్నారు.
![సామాజిక కార్యకర్త వెంకట్రావు ఆత్మహత్యాయత్నం.. ఎందుకంటే..? Suicide attempt](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15112545-799-15112545-1650889602993.jpg)
సామాజిక కార్యకర్త వెంకట్రావు ఆత్మహత్యాయత్నం
సామాజిక కార్యకర్త వెంకట్రావు ఆత్మహత్యాయత్నం
ఒంటిపై పెట్రోల్ పోసుకునేందుకు యత్నించగా అక్కడే ఉన్న రెవెన్యూ సిబ్బంది అడ్డుకున్నారు. వెంకట్రావు వద్ద ఉన్న పెట్రోల్ సీసాను లాక్కున్నారు. ఆయన కార్యాలయం గేటు వద్ద ఆందోళనకు దిగారు. దుగ్గిరాలలోని 18 రకాల సమస్యలపై తాను వినతిపత్రం ఇచ్చినా అధికారులు స్పందించలేదని వెంకట్రావు ఆరోపించారు. రోజూ వచ్చి సమస్యల పరిష్కారం కోసం అర్జీలు ఇస్తూ తమని వేధిస్తున్నారని అధికారులు అంటున్నారు.
ఇదీ చదవండి: Family suicide attempt: విజయవాడలో కుటుంబం ఆత్మహత్యాయత్నం.. అప్పులే కారణమా..!