ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Snake: మద్యం సీసాలో పాము పిల్ల.. - మద్యంలో పాము

గుంటూరు జిల్లా పొన్నూరులో మద్యం సీసాలో పాము పిల్ల కలకలం రేపింది. ప్రభుత్వ మద్యం దుకాణంలో ఇంటికి తీసుకెళ్లి చూడగా మద్యం సీసాలో పాము పిల్ల ఉన్నట్టు గుర్తించారు. వెంటనే మద్యం దుకాణానికి వెళ్లి సిబ్బందిని నిలదీశారు. అసలేం జరిగిందంటే..?

snake in liquor bottle
మద్యం సీసాలో పాము

By

Published : Sep 10, 2022, 8:25 PM IST

రాష్ట్రంలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఇప్పటికే తక్కువ రకాల మద్యం సరఫరా అవుతుందని మద్యం ప్రియులు వాపోతున్నారు. తాజాగా గుంటూరు జిల్లా పొన్నూరులోని బాపట్ల బస్టాండ్ వద్ద ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణంలో గత రాత్రి కొందరు యువకులు మద్యం సీసాను కొనుగోలు చేశారు. ఇంటికి వెళ్లి అట్టపెట్టె తెరిచి చూడగా మద్యం సీసాలో పాము పిల్ల ఉన్నట్టు గుర్తించారు. వెంటనే మద్యం షాప్ వద్దకు వెళ్లి దుకాణంలోని సిబ్బందిని నిలదీశారు. వేరే మద్య సీసా ఇవ్వడానికి నిరాకరించడంతో వారితో వాదనకు దిగారు. దీంతో చేసేదిలేక సిబ్బంది... మరో బాటిల్ ఇచ్చి వెనక్కి పంపించారు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

మద్యం సీసాలో పాము

ABOUT THE AUTHOR

...view details