గుంటూరు జీజీహెచ్(guntur GGH)లో క్యాన్సర్ వైద్యం కోసం రాష్ట్రం నలుమూలల నుంచి రోగులు వస్తుంటారు. ఈ ఆస్పత్రిలో క్యాన్సర్ చికిత్సకు ఉపయోగపడే సకల సదుపాయాలు అందుబాటులో ఉండటంతో తాకిడి ఎక్కువగానే ఉంటుంది. కానీ కొన్ని రోజులుగా నిర్దేశిత మందుల బడ్జెట్(medicines budget) అయిపోయిందని, ఉచిత మందులు లేవని వైద్యులు చెబుతున్నారు. సరైన మందులు లేక కొందరు పేషెంట్లకు రేడియేషన్(radiation) ఇచ్చి సరిపెడుతున్నారు. అత్యవసరమైతే మందులు బయట కొనుగోలు చేయాలని రోగులకు వైద్యులు సూచిస్తున్నారు. దీనివల్ల ఖరీదైన మందులు కొనుగోలు చేయలేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. మందులు లేకపోవడంతో సకాలంలో జరగాల్సిన కీమోథెరపీ జరగట్లేదని వాపోతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వైద్యం కోసం వచ్చిన రోగులు రవాణా ఛార్జీలకు తోడు మందుల భారం భరించలేకపోతున్నామని చెబుతున్నారు.
అధికారుల స్పందన...