గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో జిల్లాలో కొత్తగా 792 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో జిల్లావ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 47,246కి చేరింది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 37,125 మంది ఇంటికి చేరుకున్నారు. తాజాగా వైరస్ ప్రభావంతో నలుగురు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 463కి చేరింది.
కరోనా అప్డేట్స్ : జిల్లాలో కొత్తగా 792కేసులు.. 4 మరణాలు - గుంటూరులో కరోనా కేసులు
గుంటూరు జిల్లాలో కొత్తగా 792 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 47వేల 246కు చేరింది. తాజాగా వైరస్ బారిన పడి నలుగురు మృతి చెందారు.
రాష్ట్రంలోనే అత్యధిక మరణాలు సంభవించిన జిల్లాల్లో గుంటూరు జిల్లా రెండో స్థానంలో నిలిచింది. కొత్తగా నమోదైన కేసుల్లో గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో 110 కేసులు నమోదయ్యాయి. ఇక మండలాల వారీగా చూస్తే.... నరసరావుపేట-92, మంగళగిరి-55, తాడేపల్లి-39, బాపట్ల-32, పొన్నూరు-30, తెనాలి-29, వినుకొండ-28, రేపల్లె-26, సత్తెనపల్లి-23, చిలకలూరిపేట-23, యడ్లపాడు-22, రొంపిచెర్ల-22, మాచర్ల-20, గురజాల-20, ఫిరంగిపురం-20, నాదెండ్ల-20, వట్టిచెరుకూరు-16, కొల్లూరు-15, చేబ్రోలు-16, రెంటచింతల-11, నకరికల్లు-11, దుగ్గిరాల-11, తుళ్లూరు-10, పిట్టలవానిపాలెం-10 చొప్పున కేసులు నమోదయ్యాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.