ఘనంగా ముందస్తు క్రిస్మస్ వేడుకలు గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కేక్ కట్ చేసి వేడుకలు ప్రారభించారు. ప్రజలు అందరూ సంతోషంగా ఉండాలని నూతన సంవత్సరం అందరికి మంచి జరగాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలకు మెరుగైన పాలన కోసం జనవరి ఒకటి నుంచి గ్రామ సచివాలయాలు అందుబాటులోకి రానున్నాయన్నారు. ప్రజలకు మెరుగైన పాలన అందించడమే తమ లక్ష్యమని ఆయన వెల్లడించారు.
చీరాలలో ఘనంగా ముందస్తు క్రిస్మస్ సంబరాలు
ఘనంగా ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఆటో యూనియన్ ఆధ్వర్యంలో చీరాలలో ఘనంగా ముందస్తు క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఒకటో పట్టణ సీఐ ఎన్ నాగమల్లేశ్వరరావు పాల్గొని కేక్ కట్ చేశారు. ఎదుటి వారికి సహాయం చేసి వారి జీవితాల్లో సంతోషాన్ని నింపినప్పుడే నిజమైన క్రిస్మస్ అని సీఐ తెలిపారు. స్వార్థం లేకుండా నిజాయితీతో వ్యవహరించాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, ఆటో డ్రైవర్లు ఐక్యతతో ఉండాలని సూచించారు.
ఇవీ చదవండి:
మంగళగిరిలో సెమీ క్రిస్మస్ వేడుకలు