గుంటూరు జిల్లా బాపట్ల మండలం బేతపూడిలో తక్కువ ధరకే బంగారం ఇస్తామంటూ మోసం చేశారు. తక్కువ ధరకు బంగారం అమ్ముతున్నట్లు తెలిసి హైదరాబాద్ నుంచి వ్యాపారులు బేతపూడికి వచ్చారు. ఈ సమయంలో వ్యాపారుల నుంచి మోసపూరితంగా 30 లక్షల డబ్బులు ఎత్తుకెళ్లారు. మోసపోయామని కొంత ఆలస్యంగా గ్రహించిన బాధితులు.. వెదుళ్లపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Gold Cheating: తక్కువ ధరకే బంగారం ఇస్తామంటూ మోసం - ఏపీ తాజా వార్తలు
తక్కువ ధరకే బంగారం ఇస్తామంటూ మోసం చేసిన ఘటన గుంటూరు జిల్లా బాపట్ల మండల పరిధిలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న వెదుళ్లపల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
SELLING FAKE GOLD CASE