ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

SC Commission: 'నా జాతి జోలికొస్తే..ఏ స్థాయి అధికారైనా వదిలేది లేదు' - ఎస్సీ కమిషన్​ ఛైర్మన్​ కీలక వ్యాఖ్యలు

SC Commission Chairman: తన జాతి జోలికొస్తే కలెక్టర్‌, ఎస్పీ, ఇతర ఏ స్థాయి అధికారి అయినా వదిలేది లేదని రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ ఛైర్మన్‌ విక్టర్‌ప్రసాద్‌ హెచ్చరించారు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతోనే ఎస్సీ, ఎస్టీ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని ఆరోపించారు. తాను ఉన్నంతవరకూ ఇతర కులాలను ఎస్సీల్లో చేర్చేందుకు అంగీకరించేది లేదని స్పష్టం చేశారు.

SC Commission Chairman
ఎస్సీ కమిషన్‌ ఛైర్మన్‌

By

Published : Jul 31, 2022, 8:16 AM IST

SC Commission Chairman: తన జాతి జోలికొస్తే కలెక్టర్‌, ఎస్పీ, ఇతర ఏ స్థాయి అధికారి అయినా వదిలేది లేదని రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ ఛైర్మన్‌ విక్టర్‌ప్రసాద్‌ వ్యాఖ్యానించారు. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ బారిస్టర్‌ విద్య పూర్తి చేసి వందేళ్లు పూర్తయిన సందర్భంగా గుంటూరులో ఇండియన్‌ లాయర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. కొందరు జడ్జిల తీరుతో అట్రాసిటీ కేసులు నిర్వీర్యం అవుతున్నాయని పేర్కొన్నారు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతోనే ఎస్సీ, ఎస్టీ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని, తమ జాతిలోనే కొందరు తమ ఎదుగుదలను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. తాను ఉన్నంతవరకూ ఇతర కులాలను ఎస్సీల్లో చేర్చేందుకు అంగీకరించేది లేదని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details