డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్‌పర్సన్‌గా డాక్టర్.సాంబశివారెడ్డి బాధ్యతలు చేపట్టారు. గుంటూరు చుట్టగుంటలోని ట్రస్ట్ రాష్ట్ర కార్యాలయంలో ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. రాష్టంలోని ప్రతి పేదవాడికి మెరుగైన వైద్యం అందిచాలనే దృఢ సంకల్పంతో సీఎం జగన్ ఉన్నారని వివరించారు.
'త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు' - ఆరోగ్యశ్రీ వైస్ ఛైర్ పర్సన్
వచ్చే రెండు, మూడేళ్లలో ఆరోగ్యశ్రీని దేశంలోనే ఉత్తమ పథకంగా తీర్చిదిద్దుతామని... డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్పర్సన్ డాక్టర్.సాంబశివారెడ్డి వివరించారు. ఇవాళ పదవీ బాధ్యతలు స్వీకరించిన ఆయన... రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు విస్తృతస్థాయిలో ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
Sambashivara Reddy
ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశంలో ప్రజలకు అందించని వైద్యసేవలు... ఏపీలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా అందిస్తునట్లు సాంబశివారెడ్డి వివరించారు. త్వరలోనే రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఆరోగ్యశ్రీ సేవలు విస్తృతస్థాయిలో ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. త్వరలోనే 104, 108 నూతన అంబులెన్స్‌లను అదుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. నెట్వర్క్ ఆసుపత్రులకు త్వరలోనే బకాయిలు చెల్లిస్తామని చెప్పారు.