ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

"ఆంధ్రుల ఆత్మగౌరవానికి దెబ్బతగులుతుంటే.. మౌనంగా ఉంటున్నారు" - గుంటూరు జిల్లా తాజా వార్తలు

Chalasani Srinivas : రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఇతర హక్కులు సాధించేందుకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని.. ఆంధ్రప్రదేశ్ విభజన హామీల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రత్యేక హోదాను మరిచిపోయాయని.. ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకోవడానికే సమయం సరిపోతోందని శ్రీనివాస్ ఎద్దేవా చేశారు.

Chalasani Srinivas
రాష్ట్రానికి ప్రత్యేక హోదా

By

Published : Aug 4, 2022, 4:10 PM IST

Chalasani Srinivas: రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనే లక్ష్యంగా ఉద్యమాన్ని ఉధృతం చేయనున్నామని సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ వెల్లడించారు. అక్టోబరులో హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు 'ఆంధ్రప్రదేశ్ యాత్ర' పేరుతో పాదయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. పాదయాత్రలో భాగంగా కళాశాలల్లో విద్యార్థులతో సన్నాహక సదస్సులు నిర్వహిస్తామన్నారు.

గుంటూరులో జరిగిన ప్రత్యేక తరగతి హోదా, విభజన హామీల సాధన సమితి సమావేశంలో చలసాని శ్రీనివాస్, అజయ్ కుమార్, మల్లికార్జున్ పాల్గొన్నారు. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రత్యేక హోదాను మరిచిపోయాయని.. ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకోవడానికే సమయం సరిపోతోందని శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. ఆంధ్రుల ఆత్మగౌరవానికి దెబ్బతగులుతుంటే మౌనంగా ఉంటున్నారని శ్రీనివాస్ ఆరోపించారు. విభజన చట్టంలోని అంశాల సాధనపై ముఖ్యమంత్రి మాట్లాడరా? అని చలసాని ప్రశ్నించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details