ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రపంచ రికార్డుపై కన్ను..మధ్యలోనే ఆగిపోయిన మహేశ్ - పరుగు ఆపేసిన రన్నర్ మహేశ్

300 కిలోమీటర్ల పరుగు చేపట్టిన ప్రకాశం జిల్లా బేస్తవారిపేట యువకుడు మహేశ్... మార్గం మధ్యలోనే ఆగిపోయాడు. తొడ కండరాలు పట్టేయడంతో కుప్పకూలిపోయాడు. త్వరలోనే మరోసారి ప్రయత్నిస్తానన్నాడు.

runner mahesh stopped his run in guntur
runner mahesh stopped his run in guntur

By

Published : Dec 25, 2020, 3:56 AM IST

ప్రపంచ రికార్డు లక్ష్యంగా 300 కిలోమీటర్ల పరుగు చేపట్టిన ప్రకాశం జిల్లా బేస్తవారిపేట యువకుడు మహేశ్... మార్గం మధ్యలోనే ఆగిపోయాడు. 36 కిలోమీటర్లు పరుగెత్తిన తర్వాత ఒక్కసారిగా తొడ కండరాలు పట్టేయడంతో కుప్పకూలిపోయాడు. లక్ష్యాన్ని చేరుకోలేక మధ్యలోనే ఆగిపోవడంపై మహేశ్ కన్నీటి పర్యంతమయ్యాడు. అతడిని ఓదార్చిన స్నేహితులు సపర్యలు చేశారు. రెండు, మూడు రోజుల విశ్రాంతి తర్వాత మళ్లీ సాధన ప్రారంభిస్తానన్న మహేశ్.... రికార్డు కోసం జనవరి, లేదా ఫిబ్రవరిలో మరోసారి ప్రయత్నిస్తానన్నాడు.

ABOUT THE AUTHOR

...view details