''డిజిటల్ చార్టుల విధానం ఎత్తేయండి'' - ఆర్టీసీలో డిజిటల్ చార్టులు
ఆర్టీసీలో డిజిటల్ చార్టుల విధానాన్ని నిరసిస్తూ.. గుంటూరులో కార్మికుల దీక్షలు కొనసాగుతున్నాయి.
rtc
ఆర్టీసీలో డిజిటల్ చార్టుల విధానాన్ని ఎత్తివేయాలని నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈ ప్రక్రియను వ్యతిరేకిస్తూ ఐదు రోజులుగా గుంటూరు ఆర్ఎం కార్యాలయం ఎదుట ఆమరణ దీక్ష చేస్తున్న కార్మికులను ఆయన పరామర్శించారు. సంఘీభావం ప్రకటించారు. డిజిటల్ చార్డుల విధానం ఎత్తేయకుంటే.. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉద్ధృతం చేస్తామని శ్రీనివాసరావు హెచ్చరించారు.