కొవిడ్‌తో కుదేలైన ప్రజా రవాణా శాఖ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. పూర్తిస్థాయిలో బస్సులు మళ్లీ రోడ్డెక్కుతున్నాయి. కరోనా మొదటి దశలో ప్రజా రవాణా పూర్తిగా స్తంభించిన నేపథ్యంలో వస్తు రవాణా సేవల (కార్గో)పై ఆర్టీసీ దృష్టి సారించింది. ఫలితాల్ని సాధించింది. మధ్యలో ధరలు పెంచి ఆదరణ కొంత తగ్గినా తరువాత సేవల్లో మార్పులు చేసింది. రాష్ట్రంలో ఎక్కడికైనా వస్తు రవాణా చేసుకునే అనకాశం ఇప్పటికే ఉంది. ప్రధాన నగరాలకు డోర్ డెలీవర్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీనికి మంచి అదరణ లభిస్తోంది. ఆర్టీసీ సేవలపై ప్రజల్లో ఉన్న నమ్మకం బుకింగ్స్ పెరిగేందుకు దోహదం చేస్తోంది. అధునాతన పరిజ్ఞానం, మానవ వనరులతో వేగంగా వస్తువుల్ని చేరవేసే చర్యలు తీసుకుంటోంది.
సత్తెనపల్లి డిపో పరిధిలో సత్తెనపల్లి పట్టణం, మండలం, ముప్పాళ్ల, క్రోసూరు, అచ్చంపేట, బెల్లంకొండ, పెదకూరపాడు, అమరావతి మండలాలు ఉన్నాయి. 64 బస్సులు రోజూ తిరుగుతున్నాయి. 6 నుంచి 7 వేల మంది బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. సర్వీసులు ఉన్న అన్ని ప్రాంతాల్లో కార్గో సేవలపై ప్రచారం చేస్తున్నారు. డిపోలో ఒక బస్సును ప్రత్యేకంగా వస్తు రవాణా సేవలకు కేటాయించారు.
- ఇక్కడి నుంచి హైదరాబాద్, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలకు కందిపప్పు, బియ్యం, కోళ్లదాణా, సున్నం రవాణా చేస్తున్నారు.
- కొవిడ్ సమయంలో కార్గో సేవల్లో జిల్లాలోనే సత్తెనపల్లి డిపో ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రైవేట్‌లో కంటే కొంత తక్కువగా ధరలు ఉన్నాయి. దీనికితోడు గమ్యస్థానానికి సకాలంలో నమ్మకంగా వెళ్తాయనే భరోసా పెంపొందిస్తున్నారు.
- కార్గో సేవల రూపంలో నెలకు రూ. రెండు లక్షల నుంచి రూ.2.50 లక్షల వరకు అదాయం అర్జించాలనే లక్ష్యంతో కసరత్తు చేస్తున్నారు.
అందుబాటులోకి డోర్ డెలీవరీ నేవలు..