ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

RSS Ram Madhav : ఏడేళ్లు గడిచినా రాజధాని ఎక్కడో తెలియదు..ఇది మన లోపం కాదా ? -ఆర్ఎస్ఎస్ రాం మాధవ్ - రాజధానిపై ఆర్ఎస్ఎస్ రాం మాధవ్

RSS Ram Madhav : దేశంలో మంచి వ్యవస్థల్ని నెలకొల్పినప్పుడే ప్రజలకు ఎక్కడకు వెళ్లినా గౌరవం లభిస్తుందన్నారు ఆర్ఎస్ఎస్ నాయకులు రాం మాధవ్. రాష్ట్ర విభజన జరిగి ఏడేళ్లు గడిచినా ఇంకా రాజధాని ఎక్కడో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ఇది మన రాజకీయ వ్యవస్థలోని లోపం కాదా అని ప్రశ్నించారు.

RSS Ram Madhav
ఇది మన రాజకీయ వ్యవస్థలోని లోపం కాదా ? -ఆర్ఎస్ఎస్ రాం మాధవ్

By

Published : Feb 27, 2022, 1:23 PM IST

Updated : Feb 27, 2022, 2:39 PM IST

RSS Ram Madhav : దేశంలో మంచి వ్యవస్థల్ని నెలకొల్పినప్పుడే ప్రజలకు ఎక్కడకు వెళ్లినా గౌరవం లభిస్తుందన్నారు ఆర్ఎస్ఎస్ నాయకులు రాం మాధవ్. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లయినా మన దేశంలో ఇంకా స్వాభిమానం అలవాటు కాలేదన్నారు. దీనికి అవినీతి రాజకీయ వ్యవస్థలే కారణమని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన జరిగి ఏడేళ్లు గడిచినా ఇంకా మనకు రాజధాని ఎక్కడో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ఇది మన రాజకీయ వ్యవస్థలోని లోపం కాదా అని ప్రశ్నించారు. దేశంలో తాజాగా నెలకొన్న హిజాబ్ వివాదంపైనా ఆయన స్పందించారు. అరబ్ దేశాల్లో ముస్లిం మహిళలు బురఖాకు వ్యతిరేకంగా దశాబ్దాలుగా పోరాడుతున్నారని... సౌదీలో బురఖా అవసరం లేదని అక్కడి రాజు ప్రకటించారని తెలిపారు. కానీ మన దేశంలో మాత్రం బురఖా ధరించాలని చెప్పి దాన్ని మత సమస్యగా మారుస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇది దేశంలో మతపరమైన విభజన తెచ్చేందుకు యత్నించటమేనని అభిప్రాయపడ్డారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం సందర్భంగా అందరూ ప్రధాని మోదీ సాయం కోరుతున్నారని తెలిపారు. కానీ మనం శాంతి వైపు ఉన్నామని.. అన్యాయానికి వ్యతిరేకంగా ఉంటామని స్పష్టం చేశారు.

గుంటూరులోని జికె కన్వెన్షన్ సెంటర్లో సమాలోచన సంస్థ నిర్వహించిన స్వాధీనత నుంచి స్వతంత్రత వైపు అంశంపై జరిగిన సదస్సులో ఆయన పాల్గొని కీలకోపన్యాసం చేశారు.

ఇది మన రాజకీయ వ్యవస్థలోని లోపం కాదా ? -ఆర్ఎస్ఎస్ రాం మాధవ్

ఇదీ చదవండి :Telugu students in Ukraine : 'తెలుగు విద్యార్థులు సరిహద్దులకు రావద్దు'

Last Updated : Feb 27, 2022, 2:39 PM IST

ABOUT THE AUTHOR

...view details