ఎక్సైజ్, టాస్క్‌ఫోర్స్, రైల్వే రక్షణదళం సంయుక్తంగా దాడులు నిర్వహించి రైళ్లలో గంజాయి తరలిస్తున్న గ్యాంగ్‌ను పట్టుకున్నారు. విశాఖ నుంచి గుంటూరు వస్తున్న సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌లో గంజాయి తీసుకెళ్తున్నట్లు అందిన సమాచారంతో... గుంటూరు రైల్వేస్టేషన్ వద్ద సోదాలు చేసి ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారి నుంచి రూ.12 లక్షల విలువైన 120 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
రైళ్లలో గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్టు - గుంటూరు నేర వార్తలు
రైళ్లల్లో గంజాయి తరలిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను గుంటూరు రైల్వే స్టేషన్ వద్ద ఎక్సైజ్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.12 లక్షల విలువైన 120 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
RPF has arrested a gang who suppling marijuana through trains