ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అబ్దుల్ సలాం ఘటనపై రౌండ్ టేబుల్ సమావేశం - అబ్దుల్ సలాం కేసును సీబీఐతో విచారణ చేపించాలని గుంటూరులో ప్రజా సంఘాలు డిమాండ్

నంద్యాలలో ఆత్మహత్య చేసుకున్న అబ్దుల్ సలాం ఘటనపై.. భవిష్యత్ కార్యాచరణ కోసం గుంటూరు అరండల్​పేటలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలతో పాటు వివిధ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ పలువురు డిమాండ్ చేశారు.

guntur round table meet
రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న నాయకులు

By

Published : Dec 2, 2020, 9:01 PM IST

అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తూ.. గుంటూరులో విపక్షాలు, ప్రజా సంఘాల నాయకులు నిరసన తెలిపారు. అరండల్ పేట మొదటి లైనులోని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ కార్యాలయంలో.. ఉద్యమ భవిష్యత్ కార్యాచరణపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఘటనకు పోలీసులు కారణం కాగా.. వారితోనే విచారణ చేయిస్తే ఉపయోగం ఏముంటుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఈ సమావేశానికి అబ్దుల్ సలాం న్యాయ పోరాట సమితి కో-కన్వీనర్ గోళ్ల అరుణ్ కుమార్, తెదేపా జాతీయ అధికార ప్రతినిధి మొహమ్మద్ నసీర్ అహ్మద్, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొరివి వినయ్ కుమార్, ఇండియన్ ముస్లిం లీగ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బషీర్ అహ్మద్, ఓబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్​లు హాజరయ్యారు. ఈ కేసులో సీబీఐ విచారణతో పాటు.. వారి కుటుంబాన్నీ ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు డిమాండ్ చేశారు. రేపు నిరసన తెలిపేందుకు ప్రజాసంఘాలు సిద్ధమవుతున్నాయి.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details