ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జాతీయ రహదారిపై 2 చోట్ల ప్రమాదాలు.. ముగ్గురు మృతి - ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం వార్తలు

జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదాలు భయాందోళ కలిగిస్తున్నాయి. గుంటూరు జిల్లాలో అద్దంకి - నార్కట్ పల్లి రహదారిపై కారు అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఇక ప్రకాశం జిల్లా మార్టురులో వేగంగా వెళ్తున్న కారు లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో భార్య మృతి చెందగా.. భర్త తీవ్రంగా గాయపడ్డాడు.

road accidents at national highway
జాతీయ రహదారిపై రెండు చోట్ల రోడ్డు ప్రమాదాలు

By

Published : Nov 26, 2020, 11:31 AM IST

గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం అన్నవరప్పాడు వద్ద అద్దంకి - నార్కట్ పల్లి ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఒంగోలు వైపు వెళ్తున్న కారు.. అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన శ్రీనివాసులు, చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన సుబ్రహ్మణ్యం అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను రాడ్ల సహాయంతో బయటకు తీశారు. తీవ్రంగా గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం నరసరావుపేట ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

ప్రకాశం జిల్లాలో...

మార్టూరులో జరిగిన ప్రమాదంలో మహిళ మృతి చెందగా ఆమె భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. 16వ నెంబరు జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని.. కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీలో కారు ఇరుక్కుపోయింది. విజయవాడ నుంచి ఒంగోలుకు కారులో దంపతులు వెళ్తుండగా.. ఈ సంఘటన జరిగింది. గాయపడ్డ వెంకటసాయికుమార్​ను గుంటూరు ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్రేన్ సహాయంతో లారీలో ఇరుక్కుపోయిన కారును తొలగించారు. మార్టూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి:

కరోనాకు వరద తోడై.. నిత్యావసరాల ధరలు నింగికి!

ABOUT THE AUTHOR

...view details