చెట్టు కింద నిద్రిస్తున్న వ్యక్తిపై ఓ కారు దూసుకెళ్లి తీవ్ర గాయలైన ఘటన గుంటూరులో జరిగింది. అరండల్ పేట 5వ లైన్లో లైబ్రరీ ఎదురుగా 60 ఏళ్ల యాచకుడు చెట్టు కింద పడుకుని సేద తీరుతున్నాడు.
అక్కడ పార్కింగ్ కారు నడిపే వ్యక్తి యాచకుడిని గమనించక అతనిపైనుంచి వాహనాన్ని పోనిచ్చాడు. తీవ్ర గాయాలు కావడం వల్ల అతను కేకలు వేశాడు. వెంటనే అతన్ని సమీప ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి వచ్చి పోలీసులు కేసు నమోదు చేశారు.