వివాదాలకు తావులేకుండా వచ్చే మే నాటికి రెవెన్యూ రికార్డులను ప్రక్షాళన చేయనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ వెల్లడించారు. వచ్చే జులై నుంచి 3 నెలలపాటు జమాబందీ నిర్వహిస్తామని చెప్పారు. గుంటూరు కలెక్టరేట్లో మంత్రులు సుచరిత, శ్రీరంగనాథరాజుతో కలిసి రెవెన్యూ రికార్డుల స్వచ్ఛీకరణ, ఇళ్ల నివేశన పట్టాలకు భూసమీకరణ అంశంపై మంత్రి బోస్ సమీక్ష నిర్వహించారు. భూయజమానుల హక్కులకు భరోసా కల్పించేలా రెవెన్యూ వ్యవస్థను పటిష్ఠం చేస్తామన్నారు. రెవెన్యూ సిబ్బందిపై పడుతున్న పని ఒత్తిడిని తగ్గిస్తామని చెప్పారు. రాష్ట్రంలో భూవివాదాలకు తావులేకుండా కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నుంచి ప్రయోగాత్మకంగా సర్వేను చేపట్టనున్నట్లు వెల్లడించారు.
'రెవెన్యూ వ్యవస్థ పటిష్ఠం చేసేందుకు ప్రయోగాత్మక సర్వే' - రెవెన్యూ డిపార్డుమెంట్ న్యూస్
వచ్చే మే నాటికి రెవెన్యూ రికార్డులను సరిచేస్తామని ఆ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. గుంటూరులో రెవెన్యూ రికార్డుల స్వచ్ఛీకరణ, పేదల ఇళ్లకు భూ సమీకరణ అంశాలపై సమీక్ష నిర్వహించిన ఆయన... రెవెన్యూ వ్యవస్థను పటిష్ఠం చేస్తామన్నారు.

రెవెన్యూ వ్యవస్థ పటిష్ఠం చేసేందుకు ప్రయోగాత్మక సర్వే
రెవెన్యూ వ్యవస్థ పటిష్ఠం చేసేందుకు ప్రయోగాత్మక సర్వే
ఇదీ చదవండి :