ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రేషన్​ కార్డు కోసం మహిళ దరఖాస్తు... షాక్​ ఇచ్చిన అధికారులు - బతికున్న మహిళ మరణించిందంటూ రేషన్​ కార్డు నిరాకరించిన గుంటూరు అధికారులు

గుంటూరు నగరంలోని ఆనంద్ పేటకు చెందిన షేక్​ ఇస్మాయిల్ తల్లి హజరాబి అనారోగ్యంతో మృతి చెందింది. ఆమెను రేషన్​ కార్డు నుంచి తొలగించే క్రమంలో అధికారులు అతడి కుమార్తె జైనాబ్​ బీ మరణించినట్లు నమోదు చేశారు. వివాహమైన ఆమె రేషన్​ కార్డు కోసం దరఖాస్తు చేయగా.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు ఆన్​లైన్​లో చూపిస్తోందని బాధితుడు చెప్పారు.

guntur government officers mistakenly updates in ration card
రేషన్​ కార్డులో గుంటూరు అధికారులు చేసిన తప్పుకు ఇబ్బంది పడుతున్న బాధితురాలు

By

Published : Mar 25, 2021, 4:26 PM IST

భార్య పేరు తొలగించమంటే.. కుమార్తె మరణించిందని నమోదు చేశారు

మరణించిన తల్లిని రేషన్ కార్డు నుంచి తొలగించాలని కోరితే.. కుమార్తె మరణించినట్లు నమోదు చేసిన ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. నగరంలోని ఆనంద్ పేటకు చెందిన షేక్ ఇస్మాయిల్ తల్లి హజరాబి.. ఆరేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించింది. రేషన్ కార్డు ఆమె పేరిటే ఉంది. అందులో తల్లి పేరు తొలగించి తన భార్య పేరిట కొత్తకార్డు మంజూరు చేయాలని ఇస్మాయిల్ దరఖాస్తు చేసుకున్నాడు. హజరాబిని కార్డు నుంచి తీసివేసిన అధికారులు.. ఇస్మాయిల్ భార్య షేక్ బతుల పేరిట కొత్త కార్డు మంజూరు చేశారు. ఈ క్రమంలో హజరాబితో పాటు ఆమె మనవరాలు జైనాబ్ బీ మరణించినట్లు నమోదు చేసి.. ఆమె పేరునూ అధికారులు తొలగించారు.

ప్రస్తుతం జైనాబ్ బీ వివాహమై.. పెదకూరపాడులోని అత్తవారింట్లో ఉంటోంది. ఆమె భర్త అక్కడ కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేస్తే తిరస్కరించారు. కారణం ఏమిటని అధికారులను ప్రశ్నిస్తే.. జైనాబ్ బీ చనిపోయినట్లు ఆన్ లైన్లో చూపిస్తోందని సమాధానమిచ్చారు. ఈ విషయాన్ని సచివాలయ సిబ్బందితో పాటు నగరపాలక సంస్థ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని ఇస్మాయిల్ చెబుతున్నాడు. స్పందనలో ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా.. ఆరు నెలలుగా కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారని చెప్పాడు. జైనాబ్ బీ పేరు ఓటర్ల జాబితాలో ఉన్నా.. రేషన్ కార్డు కోసం ఇబ్బందులు పడాల్సి వస్తోందని వాపోయాడు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details