ఇటీవల హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్య కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్ భరోసా ఇచ్చారు. రమ్య తల్లిదండ్రులు బుధవారం కలెక్టర్‌ను కలిశారు. ఘటన విషయంలో ప్రభుత్వం స్పందించి త్వరితగతిన చర్యలు చేపట్టినందుకు రమ్య తల్లిదండ్రులు ప్రభుత్వానికి కృతజ్ఙతలు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేయడంతో పాటు, ప్రభుత్వం తమ కుటుంబానికి మానసికంగా అన్ని విధాలా అండగా ఉందని వారు తెలిపారు. పదిలక్షల ఆర్ధిక సహాయం అందించారన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని సీఎం ఆదేశాల మేరకు కుటుంబానికి నివాస స్థలం, వ్యవసాయ భూమి, పెద్దకుమార్తెకు ప్రభుత్వ ఉద్యోగం మంజూరుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.
VIVEK YADAV : 'రమ్య కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది' - guntur crime
గుంటూరులో దారుణ హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్య కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ అన్నారు. ఘటన విషయంలో ప్రభుత్వం స్పందించి, త్వరితగతిన చర్యలు చేపట్టినందుకు రమ్య తల్లిదండ్రులు ప్రభుత్వానికి కృతజ్ఙతలు తెలిపారు.
గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్