ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

RAMYA CASE: పూర్తైన రమ్య హత్య నిందితుడి స్నేహితుల విచారణ - guntur news

గుంటూరు రమ్య హత్య కేసులో నిందితుడు శశికృష్ణ స్నేహితులను పోలీసులు విచారణ చేశారు. హత్యలో వారి ప్రమేయం లేదని తేలడంతో విడిచిపెట్టినట్లు తెలుస్తోంది.

RAMYA CASE
RAMYA CASE

By

Published : Aug 19, 2021, 10:59 PM IST

గుంటూరులో ఇటీవల దారుణహత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో మరో ఇద్దరు యువకుల పాత్రపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. నిందితుడు శశికృష్ణను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేయగా.. అతనికి సన్నిహితంగా ఉన్న మరో ఇద్దరు యువకుల వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. వీరు వట్టిచెరుకూరు మండలం ముట్లూరుకు చెందిన యువకులు.

ఈ నెల 15న రమ్యను కత్తితో పొడిచి హత్యచేసిన శివకృష్ణకు.. హత్యకు వినియోగించిన కత్తి వీరిలో ఓ యువకుడి నుంచి చేరిందని తెలుసుకున్న పోలీసులు.. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. శశికృష్ణతో కలిసి ఈ యువకులు గతంలో ఓసారి రమ్య చదివే కళాశాల వద్దకు వెళ్లినట్లు తెలిసింది. హత్యకు సంబంధించి వీరి ప్రమేయం లేదని విచారణలో నిర్ధారణ అవడంతో వీరిని విడిచిపెట్టినట్లు తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details