ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

దగ్గరవుతున్న రుతుపవనాలు.. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు

నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. అనంతపురం, గుంటూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాలోని పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి.

rains at andhra pradesh
rains at andhra pradesh

By

Published : Jun 3, 2021, 9:34 AM IST

కేరళ సముద్ర తీర ప్రాంతానికి చేరువలో నైరుతి రుతుపవనాలు సంచరిస్తున్నాయి. ఈ ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. అనంతపురం జిల్లావ్యాప్తంగా మోస్తరు వర్షాలు పడుతున్నాయి. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో రాత్రి నుంచి ఎడతెరిపి లేని వాన కురుస్తోంది. కర్నూలు జిల్లాలో రాత్రి నుంచి వర్షం పడుతోంది. ఆలూరు మండలం కమ్మరచేడు వద్ద తాత్కాలిక వంతెన తెగింది. ఆదోని-ఆలూరు మధ్య రాకపోకలు నిలిచాయి.

ప్రకాశం జిల్లా దర్శిలో వర్షం

ప్రకాశం జిల్లా దర్శిలో బుధవారం రాత్రి ఓ మోస్తరు వర్షం కురిసింది. పట్టణంలోని ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. పొదిలి రోడ్డులోని కాటేరు వాగు పొంగి వాహనాల రాకపోకలకు కొంత సేపు అంతరరాయం ఏర్పడింది.

వర్ష సూచన

రాయలసీమ జిల్లాల్లో ఇవాళ ఉరుములతో కూడిన జల్లులు పడే సూచన ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కోస్తాంధ్రలోని ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలో జల్లులు పడే సూచనలు ఉన్నట్లు తెలిపింది.

ఇదీ చదవండి:

పాకిస్థాన్‌ నుంచి.. తిరిగొస్తాననుకోలేదు: ప్రశాంత్

ABOUT THE AUTHOR

...view details