గుంటూరు రైల్వే స్టేషన్‌ను అత్యాధునిక సౌకర్యాలతో.. ప్రయాణికుల అవసరాలకు తగ్గట్లుగా తీర్చిదిద్దుతామని భారతీయ రైల్వేబోర్డ్, ప్రయాణికుల సేవాసమితి సభ్యులు వెంకట రమణి తెలిపారు. ప్రయాణికుల సేవా సమితి తరపున ఆరుగురు సభ్యులు రైల్వే అధికారులతో కలిసి ఇవాళ గుంటూరు రైల్వే స్టేషన్‌లోని సౌకర్యాలను పరిశీలించారు. ప్రయాణికుల సౌకర్యాలు, సంబంధిత వ్యక్తుల నుంచి ఫిర్యాదులు, సలహాలను స్వీకరించారు. అధికారులు, సిబ్బంది ప్రవర్తన, దుకాణాల్లో విక్రయించే పదార్థాలు, భద్రతా పరమైన అంశాలు, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. దేశవ్యాప్తంగా రైల్వేస్టేషన్లలో సౌకర్యాలను పరిశీలిస్తున్నట్లు వెంకటరమణ తెలిపారు. ఇప్పటివరకూ 7 జోన్లలో 160 స్టేషన్లలో పరిశీలన పూర్తి చేశామన్నారు. నేరుగా ప్రయాణికులతో మాట్లాడి అభిప్రాయాలు సేకరిస్తున్నామన్నారు. గుంటూరు స్టేషన్లో అన్ని ప్లాట్ఫారంల వరకూ ఆర్వోబీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారని వెల్లడించారు. ఇక అన్ని ప్లాట్ ఫారాలలో లిఫ్టులు ఏర్పాటు చేయాలని సూచించినట్లు చెప్పారు. 1,4,5 ప్లాట్ ఫాంలలో ఎస్కలేటర్లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. గుంటూరు నుంచి రాయలసీమ, దిల్లీ, చెన్నైలకు అదనపు రైళ్లు, హాల్ట్‌ల గురించి ప్రతిపాదనలు వచ్చాయని... వాటిని రైల్వే బోర్డు దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
'గుంటూరు రైల్వేస్టేషన్‌ను అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దుతాం'
దేశవ్యాప్తంగా రైల్యేస్టేషన్లలో సౌకర్యాలను ప్రయాణికులు సేవా సమితి సభ్యులు పరిశీలిస్తున్నారు. ఇందులో భాగంగా గుంటూరు రైల్వేస్టేషన్లో ప్రయాణికులు సౌకర్యాలు, సంబంధిత వ్యక్తుల నుంచి సలహాలు, ఫిర్యాదులను సేకరించారు.
గుంటూరు రైల్వే స్టేషన్‌ను పరిశీలించిన భారతీయ రైల్వే బోర్డు సభ్యుడు