బాపూజీ స్ఫూర్తి బాట-రాజధాని పోరుబాట పేరుతో రైతులు 29 గ్రామాల్లో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. తుళ్లూరు, వెలగపూడి, మందడం, బోరుపాలెం, వెంకటపాలెం, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, ఉద్దండరాయునిపాలెం, పెదపరిమి, అనంతవరం, నెక్కల్లులో రైతులు కాగడాల ర్యాలీ చేశారు. బాపూజీ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. కృష్ణాయపాలెం, వెంకటపాలెం, పెదపరిమిలో రైతులు మానవహారం నిర్వహించారు. మందడం వీధుల్లో రైతులు మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు.
రాజధాని కోసం.. రైతుల కాగడాల ప్రదర్శన
అమరావతి రైతులు 29 గ్రామాల్లో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. బాపూజీ స్ఫూర్తి బాటలో నడుస్తూ... అమరావతిని రాజధానిగా సాధించుకుంటామని నినాదాలు చేశారు.
Amaravati farmers