"మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు"
'రాజధాని ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడిస్తాం' - ఏపీలో రాజధాని రగడ వార్తలు
అమరావతిలోనే రాజధాని కొనసాగించాలంటూ ప్రజాసంఘాల ప్రతినిధులు, వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుంటూరులో నిరసన చేపట్టారు. బృందావన్ గార్డెన్స్ నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు ర్యాలీ నిర్వహించారు. సేవ్ అమరావతి - సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ నినాదాలు చేశారు. మూడు రాజధానుల ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాజధాని పరిధిలోని ప్రజాప్రతినిధులు స్పందించకపోతే వాళ్ల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు.

protest continue in guntoor over capital city issue