ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీలు - Vizag steel plant latest news

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించాలన్న కేంద్రం నిర్ణయంపై కార్మికులు, వామపక్ష నాయకులు భగ్గుమన్నారు. ప్రైవేటీకరణ యత్నాలను నిలిపేయాలనే డిమాండ్‌ చేస్తూ పలు నగరాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించారు. కేంద్రం తీరును నిరసిస్తూ.. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అని నినాదాలు చేశారు.

protest against privatization of the Vizag steel plant
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీలు

By

Published : Feb 5, 2021, 7:33 PM IST

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఆంధ్రుల ఆస్తి అని... దాన్ని అమ్మడానికి మోదీ ఎవరని సీపీఐ నాయకులు ప్రశ్నించారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను నిరసిస్తూ... గుంటూరులో ఆ పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు. నగరంలోని శంకర్‌ విలాస్‌ కూడలి నుంచి లాడ్జి సెంటర్‌ అంబేడ్కర్‌ కూడలి వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. విశాఖ ఉక్కు కోసం సుదీర్ఘ కాలం పోరాటం చేసి.. 32మంది ప్రాణ త్యాగ ఫలితంగా సాధించుకున్నామని గుర్తుచేశారు. కేంద్రం నిర్ణయాన్ని మార్చకోకపోతే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు

విశాఖలో..

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు ఉద్యమాన్ని పునఃప్రారంభిస్తామని హెచ్చరించారు. కేంద్రం వైఖరికి వ్యతిరేకంగా నగరవీధుల్లోకి వచ్చారు. వందల సంఖ్యలో కార్మికులు.. కూర్మన్నపాలెం జంక్షన్‌ నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకూ నినాదాలు చేస్తూ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ ఆందోళనలో తెదేపా పాల్గొని మద్దతు తెలిపింది.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీలు


ఇదీ చూడండి:విశాఖ స్టీల్​ ప్లాంట్​పై ఈనెల 14న దిల్లీ వెళ్లనున్న రాష్ట్ర భాజపా నేతలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details