ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'బిల్లు చెల్లించకపోతే మృతదేహాన్ని మున్సిపాలిటీ వాళ్లకు అప్పగిస్తాం' - Corona effect on Guntur

ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా.. అధికారులు ఎంత తనిఖీలు చేసినా.. ప్రైవేట్ ఆసుపత్రుల ఆగడాలు ఆగడం లేదు. అసలే మనిషిని కోల్పోయిన బాధలో ఉన్న కుటుంబాలను... బిల్లుల పేరుతో మరింత కుంగదీస్తున్నాయి కొన్ని ఆసుపత్రులు. గుంటూరులో కొవిడ్​తో ఆసుపత్రిలో చేరిన ఓ వ్యక్తి మృతిచెందగా... బిల్లు నిమిత్తం 4.93 లక్షలు చెల్లిస్తేనే మృతదేహం ఇస్తామంటూ.. ఆసుపత్రి సిబ్బంది ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాధితులు ఫిర్యాదు చేశారు.

Private Hospitals Harassments for Fee
Private Hospitals Harassments for Fee

By

Published : May 8, 2021, 9:52 AM IST

గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం తిమ్మాపురానికి చెందిన బాబు, అతని భార్య పద్మావతి కొవిడ్ చికిత్స నిమిత్తం గుంటూరు ఓల్డు క్లబ్ రోడ్డులోని నారాయణ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేరారు. భార్య ఆరోగ్యం కుదుట పడింది. భర్త బాబు చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. ఆసుపత్రి బిల్లు రూ.6,93,558 అయ్యిందని... ఇప్పటి వరకు కేవలం 2 లక్షలు మాత్రమే చెల్లించారని ఆసుపత్రి వైద్యులు బంధువులకు తెలిపారు.

బాబు మృతదేహం ఇవ్వాలంటే మిగిలిన రూ.4,93,558 చెల్లించాలని.. లేకపోతే శవాన్ని మున్సిపాలిటీ వాళ్లకు అప్పగిస్తామని ఆసుపత్రి సిబ్బంది బెదిరిస్తున్నారంటూ బాధితులు.. విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. విజిలెన్స్ అధికారులు, వైద్య అధికారులు ఆసుపత్రిలో విచారణ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వైద్య ఖర్చులు చేశారని విచారణలో తేలింది. వైద్యాధికారి కిషోర్ కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన కొత్తపేట సీఐ రాజశేఖర్రెడ్డి... దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details