ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Guntur GGH: 'మృతదేహం తీసుకెళ్లేందుకు కమీషన్​ ఇవ్వలేం' - గుంటూరు జీజీహెచ్​ వద్ద అంబులెన్స్​ డ్రైవర్ల ఆందోళన ధర్నా

Guntur GGH: గుంటూరు జీజీహెచ్‌ వద్ద ప్రైవేటు అంబులెన్స్ డ్రైవర్లు నిరసనకు దిగారు. కమీషన్ల కోసం మార్చురీలో సార్జంట్‌ అనే వ్యక్తి వేధిస్తున్నారని ఆరోపించారు. 20 శాతం కమీషన్ ఇవ్వలేమంటూ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

Guntur GGH
అంబులెన్స్ డ్రైవర్ల నిరసన

By

Published : May 17, 2022, 3:56 PM IST

Guntur GGH: గుంటూరు ప్రభుత్వాసుపత్రి మార్చురీలో సార్జంట్‌గా పనిచేస్తోన్న విశ్వనాథం.. కమీషన్ల కోసం వేధిస్తున్నాడని ప్రైవేటు అంబులెన్స్ డ్రైవర్లు ఆందోళనబాట పట్టారు. ఆస్పత్రి నుంచి మృతదేహాలను తీసుకువెళ్లాలంటే 20 శాతం వరకు కమీషన్​ ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారని వారు ఆరోపించారు. ప్రభుత్వ నిర్దేశించిన ఛార్జీలే వసూలు చేస్తున్నామని.. 20 శాతం కమీషన్ ఇవ్వలేమంటూ డ్రైవర్లు నిస్సహాయత వ్యక్తం చేశారు. కమీషన్ ఇవ్వకపోవడంతో బయట నుంచి అంబులెన్సులు పిలిపిస్తున్నారని.. సదరు ఉద్యోగి సొంత వాహనాన్ని వినియోగిస్తున్నారని ఆరోపించారు. కమీషన్ ఇవ్వడం లేదని గేటు పాస్ విధానాన్ని తీసుకొచ్చారని వాపోయారు. న్యాయం చేయాలని ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

అంబులెన్స్ డ్రైవర్ల నిరసన

ABOUT THE AUTHOR

...view details